కథ అదేనా!

Tuesday, January 21, 2025

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా రాజా సాబ్‌. డైరెక్టర్‌ మారుతి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో నిలస్తుందని అంతా అనుకున్నారు.  అయితే ఇప్పటికే కొన్ని సినిమాల విడుదల తేదీలు ప్రకటించడంతో అప్పుడు వస్తుందా? లేదా అనే విషయం మాత్రం అనుమానమే.

ఇదిలా ఉండగా తాజాగా రాజా సాబ్ సినిమా గురించి ఈ సినిమా సహనిర్మాత గా వ్యవహరిస్తున్న ఎస్ కే ఎన్ తాజాగా స్పందించాడు. ఈరోజు ఘటికాచలం అనే ఒక చిన్న సినిమాని మారుతి- ఎస్కేఎన్ కలిసి విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించిన టీజర్ విడుదల ఈవెంట్ జరిగింది. ఈ టీజర్ విడుదల ఈవెంట్ లోనే తనకు హారర్ సినిమాలంటే ఇష్టమని ఎస్కేఎన్ చెప్పుకొచ్చాడు.

దీంతో రాజా సాబ్ అందరూ రెగ్యులర్ సినిమా అనుకుంటున్నారు… అసలు వరల్డ్ ఎప్పుడు చూపిస్తారు అని మీడియా ప్రశ్నించగా October 23 న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాజా సాబ్ వరల్డ్ ని పరిచయం చేయడానికి ప్లానింగ్ అని,, అక్కడ నుండి రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు. అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమా గురించి మరిన్ని విషయాలు వెల్లడిస్తామని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

ఈ సినిమా కూడా హారర్ ఎలిమెంట్స్ తోనే నడుస్తుందని ఈరోజు ఎస్కేఎన్ ఓపెన్ అయ్యారు. ఇప్పటివరకు ఈ సినిమా గురించి అనేక రకాల ప్రచారాలు జరిగాయి కానీ ఏ ఒక్కరూ సినిమా గురించి కాస్త కూడా చిన్న విషయం కూడా ఎక్కడా లీక్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈరోజు ఏ మూమెంట్లో ఉన్నారో తెలియదు కానీ ఎస్కేఎన్ మాత్రం సినిమా హారర్ ఎలిమెంట్స్ తో ఉంటుందని తేల్చి చెప్పేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles