ప్రభాస్‌ స్పెషల్‌ పర్సన్‌ కి వాయిస్‌ ఇచ్చిన స్టార్‌ హీరోయిన్‌!

Friday, June 28, 2024

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తాజాగా నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సినిమాని స్టార్‌ అండ్‌ యంగ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని నాగ్‌ అశ్విన్‌ పాన్‌ వరల్ట్‌ సినిమాగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, విశ్వనటుడు కమల్‌ హాసన్‌ వంటి లెజెండరీ నటులు అందరూ ఈ సినిమాలో చేస్తున్నారు.

అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె ,దిశా పటాని హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ సినిమాను జూన్ 27 న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవల ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో డార్లింగ్స్‌, ఫైనల్‌గా ఒక ముఖ్యమైన వ్యక్తి మన లైఫ్‌లోకి రాబోతున్నారు. వెయిట్ చేయండి అంటూ  ఓ పోస్ట్ పెట్టి అందర్ని గందరగోళానికి గురి చేశాడు.

దీంతో  ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరా అని ఫ్యాన్స్ అందరు ఎంతగానో ఎదురు చూసారు. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు ఓ మెషిన్ ఉంటుందట . దాని పేరు బుజ్జి అని తెలుస్తుంది. ఈ సినిమాలో బుజ్జి ఎవరోకాదు ఓ కారు అంట. అయితే సినిమాలో ఆ కారు మాట్లాడుతుందట . ఇక ఈ మాటలని మహానటి ‘కీర్తి సురేష్’ వాయిస్ తో వినిపించేందుకు మేకర్స్ ప్లాన్ చేసారు.బుజ్జికి కీర్తి వాయిస్ ఓవర్ అందించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles