హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్‌ డైరెక్టర్‌ కొడుకు!

Saturday, January 18, 2025

టాలీవుడ్‌ అనే కాదు..దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా కామన్‌. కేవలం హీరోల వారసులు, హీరోయిన్ల వారసులు మాత్రమే కాకుండా దర్శకులు, నిర్మాతల వారసులు కూడా ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్‌ ను ఫ్రూఫ్‌ చేసుకుంటున్నారు. ఇంకా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మరో డైరెక్టర్‌  కుమారుడు హీరోగా మారేందుకు రెడీ అవుతున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు ఎన్నో యూత్ ఫుల్ సినిమాలు డైరెక్ట్ చేసి ప్రస్తుతానికి సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్ తేజ.

తేజ తన కొడుకు అమితోవ్ తేజను హీరోగా పరిచయం చేయడానికి రెడీ గా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నవంబర్ లేదా డిసెంబర్ నుండి షూట్ కి వెళ్లొచ్చు అని తెలుస్తుంది.  తేజ గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. చివరిగా నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాతో హిట్ అందుకున్న ఆయన దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా అహింస అనే మూవీ చేసి చతికిల పడ్డాడు.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రమే కాదు విమర్శకుల దగ్గర కూడా దారుణమైన విమర్శలు ఎదుర్కొంది. అయితే తేజ కుమారుడి సినిమాకి తేజనే దర్శకత్వం వహించబోతున్నారు అని సమాచారం. అయితే నిర్మాత ఎవరు? అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు. తేజ స్వయంగా సినిమా నిర్మిస్తారా? లేక బయట నిర్మాత ఎవరైనా సినిమా అని నిర్మిస్తారా? అనే దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles