విడాకుల పై క్లారిటీ ఇచ్చిన స్టార్‌ కపుల్‌!

Sunday, December 22, 2024

బాలీవుడ్ స్టార్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె విడాకులు తీసుకుంటున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.. రెండు రోజులకు ముందు రణ్‌వీర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడంతో విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు షికార్లు చేశాయి. తొందరలో దీపిక తల్లి కాబోతుండగా.. ఈ క్రమంలోనే విడాకుల వార్తలు రావడంతో ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు.

తాజాగా, రణ్‌వీర్ డైవర్స్ వార్తలపై పరోక్షంగా స్పందించాడు.ముంబైలోని జ్యూవెలరీ బ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొన్న రణ్‌వీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘ నాకు ఇష్టమైన రింగ్స్ రెండు ఉన్నాయి. అందులో ఒకటి మా పెళ్లికి నా భార్య గిఫ్ట్‌గా తొడిగిన రింగ్. అలాగే రెండోది ప్లాటినమ్ ఉంగరం దానిని మా నిశ్చితార్థానికి దీపిక నా చేతికి పెట్టింది.

ఈ రెండు నాకు చాలా చాలా ఇష్టమైన ఉంగరాలు’’ అని వాటిని చూపిస్తూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా తన భార్యపై ఉన్న ప్రేమను ఈ విధంగా తెలియజేసి విడాకులు వార్తలకు  క్లారిటీ ఇచ్చాడని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు రణ్‌వీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలు డిలీట్ ఎందుకు చేశాడో క్లారిటీ మాత్రం రాలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles