డబ్బింగ్‌ పూర్తి చేసిన స్టార్‌ నటి..ఇక సినిమాలకు గ్యాపే!

Thursday, July 4, 2024

పాన్‌ ఇండియా కథానాయకుడు ప్రభాస్‌ , మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ కాంబోలో వస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ కల్కి 2898 ఏడీ చిత్రం. ఈ సినిమాలో ప్రభాస్‌ కు జోడీగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో  బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్ అశ్వత్థామగా యాక్ట్‌ చేస్తుండగా… విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.

పశుపతి, దిశా పటానీ ముఖ్య  పాత్రల్లో  ఈ సినిమాలో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.‘కల్కి 2898 ఏడీ’లో తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్‌ని దీపికా పదుకొనే తాజాగా పూర్తి చేశారట. హిందీ, కన్నడ భాషల్లో డబ్బింగ్‌ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం దీపిక గర్భవతి. దీంతో సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి.. జూన్‌ నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమై రెస్ట్ తీసుకోనుకుంటున్నారట.

అందుకే కల్కి 2898 ఏడీలో తన పాత్ర డబ్బింగ్‌ని పూర్తి చేసుకుందట. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌.. ఇలా పలు భాషల్లో రిలీజ్ కానుంది. అయితే హిందీ, కన్నడ వెర్షన్లకు మాత్రమే దీపికా తన డబ్బింగ్‌ ని పూర్తి చేసినట్లు సమాచారం. ఇతర భాషల్లో వేరేవారితో డబ్బింగ్‌ చెప్పిస్తారా? లేదా దీపికానే చెబుతారా? అన్నది ఇంకా తెలియరాలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles