పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ చిత్రంలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు. అయితే, ఈ సినిమాతో పాటు ‘ఫౌజీ’ అనే మరో సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా పీరియాడిక్ వార్ మూవీగా మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సైనికుడు పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు.
అయితే, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు మరి కొంతమంది ముఖ్య ఆర్టిస్టులు పాల్గొననున్నారు. ఇక ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో జైల్ ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు.