‘భైరవం’ నుంచి ‘ఓ వెన్నెల’ పాట వచ్చేసింది

Sunday, January 5, 2025

‘భైరవం’ నుంచి ‘ఓ వెన్నెల’ పాట వచ్చేసింది దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘భైరవం’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ‘ఓ వెన్నెల’ అనే సాంగ్‌ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు కానుకగా తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

ఈ పాటను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. అదిరిపోయే క్యాచీ ట్యూన్‌తో ఈ పాటను శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేశారు. ఈ పాటను బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్‌లపై తీశారు. కోనసీమ అందాలను ఈ పాటలో అద్భుతంగా రూపొందించారు. ఇక అనురాగ్ కుల్‌కర్ణి, యామిని ఘంటసాల ఈ పాటను సూపర్‌ గా ఆలపించారు. రొమాంటిక్ సాంగ్‌గా వచ్చిన ‘ఓ వెన్నెల’ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles