ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపుతోన్న సినిమా వార్ 2. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్‌కు ఇంకా ఒక నెల టైమ్ ఉన్నా, ఈ గ్యాప్‌లో మరిన్ని అప్డేట్స్ వెలుగులోకి రానున్నాయి. ట్రైలర్‌కు ముందు ఒక స్పెషల్ ట్రీట్‌గా ఫస్ట్ సింగిల్ రాబోతుందని టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే, వార్ 2 నుంచి మొదటి పాట ఈ వారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది రొమాంటిక్ సాంగ్ అయ్యే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తోంది. ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉన్నా, సోషల్ మీడియాలో అయితే ఈ బజ్ బాగానే పెరిగిపోయింది.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ప్రీతమ్ పని చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ఆయన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో పాటలపై కూడా అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక సినిమా విషయానికి వస్తే, ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో, మిగతా సాంగ్స్ మరియు ట్రైలర్ ఎలా ఉండబోతున్నాయన్నది ఫ్యాన్స్‌లో పెద్ద ఆసక్తిగా మారింది.
