షూటింగ్‌ మొదలుపెట్టలేదు..కానీ విడుదల తేదీ ఖరారు ఎప్పుడంటే!

Saturday, January 18, 2025

విక్టరీ వెంకటేష్ ఇటీవల సైంధవ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. కానీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అయితే తాజాగా వెంకీ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. గతంలో  F2, F3 వంటి రెండు సూపర్ హిట్లు అందించిన అనిల్ రావిపూడి కాంబోలో మరోసారి వెంకీ నటించబోతున్న సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవలే మూవీ మేకర్స్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు సినిమాల్లో హాస్యం ప్రధానంగా సాగే కథాంశాన్ని ఎంచుకున్న అనిల్ ఈసారి సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ పోలీస్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ థీమ్’ లో ఈ సినిమా సాగనుంది. కాగా ఈ సినిమా షూటింగ్  ఆగస్టు నుండి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు.

ప్రస్తుతం అందుకు తగ్గట్టు వెంకీ లుక్ మార్చే పనిలో ఉన్నారు. ఆగస్టు మొదటి వారంలో వెంకీ మామ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నట్లు సమాచారం. ఆ తరువాత నుంచి  కంటిన్యూ షూట్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి గతంలో చేసిన సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని కేవలం ఐదు నెలల్లో తీశారు. ఈ సినిమాని కూడా ఐదు నెలల్లో తీసి వచ్చే ఏడాది 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు పక్కా ప్లానింగ్ వేస్తున్నారు.

 వెంకీ,అనిల్ రావిపూడి, దిల్ రాజుల హ్యాట్రిక్ కాంబోగా ఈ మూవీ రానుంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి వెంకీ సరసన నటించబోతున్నారు. ఈ చిత్రానికి “సంక్రాంతికి వస్తున్నాం” అనే టైటిల్ ప్రస్తుతం పరిశీలనలో ఉంది..

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles