టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇండియా లెవెల్లో ఎలాంటి సెన్సేషన్ ని సెట్ చేసారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సందీప్ మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి కరుడుగట్టిన వీరాభిమాని అనేది కూడా అందరికీ తెలుగు. రీసెంట్ గానే తన భద్రకాళి ఆఫీస్ లో పెట్టుకున్న మెగాస్టార్ ఫ్రేమ్ టోటల్ సోషల్ మీడియాని షేక్ చేసింది.
ఇక లేటెస్ట్ గా మరో పిక్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫ్రేమ్ నుంచి సందీప్ రెడ్డి వంగ సహా మరో సెన్సేషనల్ దర్శకుడు బుచ్చిబాబు సానా కలిపి పోజ్ ఇచ్చిన పిక్ సోషల్ మీడియాని రూల్ చేస్తుంది. సందీప్ మెగాస్టార్ కి వీరాభిమాని అయితే ఆ మెగాస్టార్ వారసునితో బుచ్చిబాబు భారీ చిత్రాన్ని ఇపుడు చేస్తున్నాడు. దీనితో ఈ క్రేజీ పిక్ ఇపుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.