పుష్ప 2 నుంచి అదిరిపోయే సెకండ్‌ సాంగ్‌ వచ్చేసింది!

Tuesday, January 21, 2025

జాతీయ నటుడు అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో వచ్చిన పుష్ప .ఈ సినిమాకి సీక్వెల్‌ గా పుష్ప 2రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. ఈ సినిమాని ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్‌ గా విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్‌, టీజర్‌ సినిమా పై  భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి చిత్ర బృందం ఫస్ట్‌ సింగిల్‌ ను విడుదల చేశారు. పుష్ప..పుష్ప అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్‌ పాటను విడుదల చేశారు.

తాజాగా ఈ సాంగ్  ప్రేక్షకుల ముందుకు వచ్చింది.’సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి “అంటూ సాగె ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పుష్ప రాజ్ ,శ్రీవల్లి కపుల్ సాంగ్ గా వచ్చిన పాట ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో  వేచి చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles