టాలీవుడ్ లో ఎనర్జీకి మారుపేరుగా నిలిచిన మాస్ మహారాజ రవితేజ, ప్రస్తుతం మాస్ జాతర సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో రవితేజ అభిమానుల్లో మంచి ఉత్సాహం కనిపిస్తుంది. ఇదే వేళ, ఆయన నుంచి మరో ఆసక్తికర అప్డేట్ బయటకి వచ్చింది.
రవితేజ తన తదుపరి సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమలతో కలిసి చేస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో రవితేజ లుక్ చాలా స్టైలిష్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక సొగసైన విమానంలో స్పానిష్ నేర్చుకునే పుస్తకాన్ని ఒక చేతిలో పట్టుకుని, మరోచేతిలో షాంపైన్ బాటిల్ తో కూర్చుని ఉన్న రవితేజ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్ చూస్తే రవితేజ పాత్రలో ఓ కొత్త యాంగిల్ ఉండబోతోందన్న అభిప్రాయం స్పష్టంగా తెలుస్తోంది.
అంతేకాదు, ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంటే తక్కువ టైమ్ లోనే షూటింగ్ పూర్తి చేసి గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఈరోజు నుంచే సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభమవగా, ఈ ప్రాజెక్ట్‌ను ఎస్‌ఎల్‌వి సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది.
మొత్తానికి మాస్ జాతర తర్వాత కూడా రవితేజ నుంచి మరో మాస్ అండ్ క్లాస్ మిక్స్ ఎంటర్‌టైనర్ రాబోతోందన్న వార్త ఫ్యాన్స్‌కి ఆనందం కలిగిస్తోంది.
