వారి డార్లింగ్‌ రిలీజ్‌ డేట్ ఫిక్స్ అయ్యింది!

Sunday, December 22, 2024

నటుడు ప్రియదర్శి హీరోగా చేస్తున్న లేటేస్ట్‌ సినిమా డార్లింగ్‌….ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్‌ ను క్రియేట్‌ చేసేసింది. ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్‌..ఖల్లాసే పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా  ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం విడుదల తేదీని తాజాగా ప్రకటించారు.  పూర్తి కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా రాబోతున్న ‘డార్లింగ్’ చిత్రాన్ని జులై 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల చేస్తున్న‌ట్లు చిత్ర బృందం తెలిపారు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు అశ్విన్ రామ్ డైరెక్ట్ చేస్తుండ‌గా, ‘హ‌ను-మాన్’ చిత్ర నిర్మాత నిరంజ‌న్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ సినిమాలో అందాల భామ న‌భా నటేష్ తో పాటు అన‌న్య నాగ‌ళ్ల‌, మొయిన్, శివారెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్ ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles