కంగువ విడుదల తేదీ ఖరారు…ఇద్దరు స్టార్‌ ల మధ్య పోటీ తప్పదా!

Wednesday, January 22, 2025

 కోలీవుడ్‌ హీరో సూర్య గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. విభిన్నమైన కథలతో సూర్య ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అందుకు తగ్గట్లుగానే కంగువ కథను ఎంచుకున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే చాలా అప్డేట్స్ వచ్చాయి. కంగువ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రం కోసం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ డేట్‌ రానే వచ్చింది. ఇక తాజాగా మూమీ మేకర్స్‌ …కంగువ విడుదల తేదీని ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 10 న కంగువ పాన్‌ ఇండియా లెవల్లో విడుదల కాబోతుందని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సరికొత్త పోస్టర్‌ ను విడుదల చేశారు.

హీరో సూర్య ఈ పోస్టర్లో హీరో చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. దీనిని చూస్తుంటే భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ కు సంబంధించిన దానిలా ఉంది. ఈ పవర్‌ ఫుల్‌ పోస్టర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకోంటోంది. ఇదిలా ఉంటే రజినీ కాంత్‌ వేట్టైయన్ కూడా అదే రోజున విడుదల కాబోతుంది. ఒకే రోజు రెండు భారీ చిత్రాలను విడుదల చేయడం వల్ల కలెక్షన్లకు గండి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు సినిమాలు ఒకే రోజు వస్తే రెండింటి మధ్య పోటీ నెలకొంటోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles