విడుదల తేదీ ఖరారైంది!

Sunday, December 22, 2024

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా హీరోగా నటిస్తున్న తాజా సాలిడ్ సినిమాల్లో యంగ్‌ డైరెక్టర్‌ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “కూలీ” సినిమా ఒకటి. మరి ఈ సినిమాలో పాన్ ఇండియా వైడ్ గా భారీ తారాగణం నటిస్తుండగా తమిళ్ నుండి ఈ సినిమా మొదటి 1000 కోట్ల సినిమా అవ్వొచ్చు అని స్ట్రాంగ్ టాక్ అయితే కోలీవుడ్ లో ఉంది.

ఇక ఈ సినిమా లోకేష్ మార్క్ స్పీడ్ లో దూసుకు పోతుండగా.. ఈ సినిమా విడుదల వచ్చే ఏడాది వేసవిలో ఉండనుందని స్ట్రాంగ్ బజ్ ఎప్పుడు నుంచో వినిపిస్తుంది. అయితే ఇపుడు దీనికి విడుదల తేదిని లాక్ చేసేసినట్టుగా తెలుస్తుంది. ఈ రూమర్స్ ప్రకారం కూలీ సినిమాని మూవీ మేకర్స్ వచ్చే ఏడాది మే 1న విడుదల చేసేందుకు తేదీని  లాక్ చేసినట్టుగా సమాచారం. అపుడు లాంగ్ వీకెండ్ కూడా ఉండడంతో మేకర్స్ ఈ సాలిడ్ ప్లానింగ్ తో రాబోతున్నారని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles