ప్రస్తుతం సంక్రాంతి రేస్ లో విడుదలకి వస్తున్న తాజా చిత్రాల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన చిత్రం “డాకు మహారాజ్” కూడా ఒకటి. మరి సాలిడ్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ మూవీ కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సమయంలో సినిమా ట్రైలర్ పట్ల మరిన్ని అంచనాలు నెలకొనగా ఈ ట్రైలర్ పై ఫైనల్ గా ఓ క్లారిటీ అయితే వచ్చింది.
దీంతో ఇండియాలో ఈ చిత్రం ట్రైలర్ జనవరి 5 ఉదయం 8 గంటల 39 నిమిషాలకి లాంచ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం 4న గ్రాండ్ గా యూఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తుండగా అక్కడ 4 న రాత్రి 9 గంటల 9 నిమిషాలకి లాంచ్ చేస్తున్నట్టుగా చెప్పారు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.