పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన “కన్నప్ప” సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచు విష్ణు లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించగా, ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ లాంటి భారీ స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు. ఈ భారీ బడ్జెట్ భక్తిరస ఎంటర్‌టైనర్ రిలీజ్ అయినప్పటి నుంచే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.
సినిమా థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మంచి స్పందన తెచ్చుకుంది. వీకెండ్ దాకా బుకింగ్స్ కూడా బాగానే సాగాయి. అయితే ఇది ఆరంభమే అని చెప్పాలి. అసలు పరీక్ష మాత్రం ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే వర్కింగ్ డేస్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సినిమా పరఫార్మెన్స్ ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది.
ఇక ఈ సినిమా తదుపరి విజయాన్ని నిర్ణయించేది వీకెండ్ తర్వాత వచ్చే వర్కింగ్ డేస్ లొనే. ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరించగలిగితే, సినిమా టాక్ మరింత బలపడే అవకాశముంది. ఓవర్ ఆల్‌గా, ‘కన్నప్ప’ మంచి ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన భక్తిరస మూవీగా నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ డేవస్సీ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకు మంచి ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని మోహన్ బాబు స్వయంగా నిర్మించడమూ మరో ప్రత్యేకత.
ప్రస్తుతంఈ సినిమా తొలిరోజుల్లో వేసిన దూకుడు కొనసాగుతుందా లేదా అన్నదే పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
