పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఓజి” విడుదలతోనే మంచి హైప్ క్రియేట్ చేసింది. పవర్ స్టార్ కెరీర్‌లోనే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మొదటి షోలు మొదలుకుని వీకెండ్ వరకు బలమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
వీకెండ్ లో పవన్ క్రేజ్, థియేటర్లలో పాజిటివ్ వైబ్ కారణంగా టికెట్ రేట్లు ఎక్కువైనా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వర్కింగ్ డేస్ ప్రారంభం కావడంతో సినిమా రన్నింగ్ అసలు పరీక్షలోకి వెళ్లింది. ఈసారి మాత్రం మునుపటి కొంతమంది సినిమాలా నెగటివ్ టాక్ రావడం లేదు. పవన్ ఎలివేషన్స్, సుజీత్ మాస్ టచ్, థమన్ ఇచ్చిన ఎనర్జీటిక్ మ్యూజిక్ వంటి అంశాలు పాజిటివ్ గా పనిచేస్తున్నాయి.
