దేశం మొత్తం అత్యధిక వసూళ్లతో ఓ ఊపు ఊపిన సినిమా ‘పుష్ప 2’. తాజాగా రూ.1500 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ మైలు రాయి దాటిన అతి తక్కువ సినిమాల్లో ‘పుష్ప 2’ కూడా ఒకటి. తెలుగునాట ‘పుష్ప 2’ రన్ దాదాపుగా పూర్తవుతుంది. నార్త్‌లో వసూళ్లు ఇంకా బాగున్నాయి. మొత్తానికి ఎలాగోలా రూ.2000 కోట్ల క్లబ్‌లోకి ఈ సినిమాని చేర్చాలని నిర్మాతలు అనుకుంటున్నారు. అందుకే ఓటీటీ విడుదల కూడా ఆలస్యం చేస్తున్నారు.
ఈమధ్య ఎంత పెద్ద సినిమా అయినా విడుదలైన 4 వారాల్లో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. అయితే ‘పుష్ప 2’ని మాత్రం 8 వారాల వరకూ విడుదల చేయకూడదని అనుకుంటున్నారు.మరోవైపు ‘పుష్ప 2’ ఓటీటీ వెర్షన్ రెడీ అయిపోయింది. 3 గంటల 20 నిమిషాల సినిమా ఇది. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కట్ చేసిన సన్నివేశాలు కొన్ని కలిపే అవకాశం ఉందని ప్రచారం నడిచింది.
అయితే అలాంటి సన్నివేశాలను కలపడం ఏమీ లేవని తెలుస్తోంది. వెండి తెరపై చూసిన వెర్షనే.. ఓటీటీ తెరపైనా చూడనున్నారు. కొత్త సన్నివేశాలు లేవు. కాకపోతే సింక్ సౌండ్ లో లోపం వల్ల థియేటర్లో కొన్ని డైలాగులు సరిగా అర్థం కాలేదు. వాటిని సరి చేశారంతే. గేమ్ ఛేంజర్ ఈవెంట్ లో పాలు పంచుకోవడానికి సుకుమార్ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈలోగా.. ఓటీటీ వెర్షన్‌కి తుది మెరుగులు కూడా అద్దేశారు. ఇక నెట్ ఫ్లిక్స్ చేతిలో పెట్టడమే తరువాయి. పుష్ప 2ని ఓటీటీలో చూడాలంటే బహుశా ఫిబ్రవరి వరకూ ఆగాల్సిందే అనుకుంటా..!