అప్పుడు చేజారిపోయిందనుకున్న అవకాశం..ఇన్నాళ్లకు మళ్లీ వచ్చింది!

Tuesday, January 21, 2025

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన “కంచె” సినిమాతో ఈ భామ హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయింది. ఆ సినిమాలో ప్రగ్యా తన అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. కంచె సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో  వరుసగా ఆఫర్స్ వచ్చాయి . కానీ  ఆ సినిమాలేవీ అంతగా ఈ ముద్దుగుమ్మకు ఉపయోగపడలేదు .  

ఇదిలా ఉంటే నందమూరి నటసింహం బాలకృష్ణ ,బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ బాలయ్య సరసన హీరోయిన్ గా నటిచింది.అఖండ సినిమాలో ప్రగ్యా తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది . ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ప్రగ్యాకు వరుస ఆఫర్స్ వస్తాయని అంత భావించారు కానీ అలా జరగలేదు.

అయితే త్వరలో అఖండ సీక్వెల్ కూడా రాబోతుంది .ఆ సినిమాలో మరోసారి ప్రగ్యా బాలయ్య సరసన మరోసారి ఆడిపడనుంది.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగ్యా పలు ఆసక్తికర విషయాలు వివరించింది. ఎవరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన చిత్రంలోనే నటించే అవకాశం లభించిందని ప్రగ్యా జైస్వాల్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న ‘ఖేల్‌ ఖేల్‌ మే’లో కీలక పాత్ర పోషిస్తోంది.

అయితే ‘2014లో అక్షయ్‌ సర్‌ ప్రధాన పాత్రలో తెలుగు డైరెక్టర్‌  క్రిష్‌ తెరకెక్కించిన ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ చిత్రం కోసం ఆడిషన్‌ ఇచ్చాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నటించే అవకాశం దక్కలేదు. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత ఆయన కథానాయకుడిగా రాబోతున్న  ‘ఖేల్‌ ఖేల్‌ మే’లో కీలక పాత్ర పోషిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఇన్నాళ్లకు ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles