వచ్చిన వాడు గౌతమ్‌!

Monday, December 8, 2025

డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు నుండి వస్తున్న మరో ఎక్సయిటింగ్ మూవీ ‘వచ్చినవాడు గౌతమ్’. మెడికల్ యాక్షన్ మిస్టరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

బ్లెడ్ అండ్ స్టెత్ తో ఉన్న అశ్విన్ బాబు లుక్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రంలో సాయి రోణక్ కేమియో పాత్ర లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో అశ్విన్ బాబు తో పాటు, రియా సుమన్, అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్, ఖేడేకర్, అభినయ, అజయ్, VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ, అమర దీప్, అభిత్ భూషణ్, నాగి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. గౌర హరి మ్యూజిక్ అందిస్తుండగా,  సురేష్ భీమగని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రం 90% షూటింగ్ పూర్తి చేసుకుంది. బేలన్స్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, పూర్తి చేసుకుని, త్వరలో మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles