“డాకు మహారాజ్” ఓఎస్టీకి ముహూర్తం పెట్టిన మ్యూజిక్ డైరెక్టర్! నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్య జైస్వాల్ అలాగే ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన భారీ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ వసూళ్లు సాధించి అదరగొట్టింది.
అయితే మేకర్స్ ఈ సినిమా మరింత హిట్ అవుతుంది అనుకున్నారు కానీ ఓవరాల్ గా ఓకే అనిపించింది. ఇక ఈ చిత్రం ఓటిటిలోకి వచ్చాక కూడా సూపర్ హిట్ అయ్యింది. అక్కడ నుంచి సినిమా ఓఎస్టీ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పుడో దీనిని సంగీత దర్శకుడు థమన్ కూడా ప్రామిస్ చేసాడు కానీ ఇంకా రిలీజ్ చేయలేదు. మరి లేటెస్ట్ గా దీనిపై ఓ ఫైనల్ క్లారిటీ తాను ఇచ్చాడు. అవైటెడ్ డాకు ఓఎస్టీని ఈ ఉగాది కానుకగా అందిస్తున్నట్టుగా తాను కన్ఫర్మ్ చేసాడు. సో ఈ ట్రీట్ కోసం ఎదురు చూస్తున్నవారు ఇంకొన్ని రోజులు ఆగితే సరిపోతుంది అని చెప్పవచ్చు.