‘దిల్ రూబా’ ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు ముహుర్తం ఖరారు!

Sunday, December 7, 2025

‘దిల్ రూబా’ ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు ముహుర్తం ఖరారు! యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా సినిమా ‘దిల్ రూబా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఆయన నటించిన గత చిత్రం ‘క’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రెస్పాన్స్‌ను అందుకోవడంతో, ఇప్పుడు ప్రేక్షకుల్లో ‘దిల్ రూబా’ మూవీపై కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ అందింది. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘అగ్గిపుల్లే’ అనే పాటను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ పాటను జనవరి 18న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండటం తో ఈ పాట ఎలా ఉండబోతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అందాల భామ రుక్సర్ ధిల్లోన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని విశ్వ కరుణ్ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్ గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమైంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles