తమిళుల నోట..జీరో ఇగో మహేశ్‌ బాబు!

Tuesday, December 24, 2024

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఇండియా లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో  చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేష్ కెరీర్ లో 29వ మూవీగా  రూపుదిద్దుకుంటుంది. అయితే ఈ భారీ సినిమా గ్యాప్ లో మహేష్ బాబు తన సమయాన్ని ఫ్యామిలీ తోనూ,   తన సినిమా కోసం పలు సినిమాలు కూడా చూసేందుకు కేటాయిస్తున్నారు.

ఆ క్రమంలోనే  కోలీవుడ్ రీసెంట్ హిట్ సినిమా “రాయన్” పై మహేష్ ప్రశంసల జల్లు కురిపించారు. ధనుష్ నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాని మహేష్ బాబు ఎంతగానో మెచ్చుకున్నారు. దీంతో తమిళ ఆడియెన్స్ ఇపుడు సోషల్ మీడియాలో మహేష్ విశాల హృదయానికి ఫిదా అయ్యారు.

ఇలా జీరో ఈగోతో అది కూడ పక్క ఇండస్ట్రీ నుంచి తమిళ సినిమాని ప్రశంసించడం చాలా ఆనందంగా ఉందని, కోలీవుడ్ నుంచే ఎంతోమంది ఉన్నప్పటికీ సినిమా గురించి మాట్లాడలేదని మహేష్ విషయంలో తమిళ ఆడియెన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా మహేష్ ఇచ్చిన రివ్యూ పై ధనుష్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తన టీం అంతా ఎంతో థ్రిల్ అయ్యామని సోషల్‌ మీడియా వేదికగా రిప్లై ఇచ్చాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles