ముహుర్తం ఖరారైంది!

Sunday, December 22, 2024

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ సినిమా ‘దేవర’.ఈ సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలో విడుదలకి సిద్దంగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ ఎంతో  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ మూవీ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముహుర్తం ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్.

సెప్టెంబర్ 22న దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుందని వారు ప్రకటించారు. అయితే, ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎక్కడ అనేది వారు ఇంకా చెప్పలేదు. ఇక ‘దేవర’ సినిమాని పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. అనిరుధ్ సంగీతం ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles