గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. రూరల్ స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ పూర్తిగా ఊరమాస్ లుక్‌తో కనిపించబోతున్నాడు. అందుకే ఈ సినిమా విడుదల కోసం అభిమానులు, సినీ వర్గాలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇకపోతే, చరణ్ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఫిలింనగర్‌లో ఆసక్తికర చర్చ మొదలైంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో ఆయన మరోసారి పని చేయబోతున్నాడని సమాచారం వస్తోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో చరణ్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
తాజాగా సుకుమార్, రంగస్థలం కథకు కొనసాగింపుగా ఒక సీక్వెల్ ఆలోచనలో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. కథ సిద్ధం అయిన వెంటనే చరణ్‌కు వినిపించాలన్న ప్లాన్‌లో ఉన్నాడట. ఈ ప్రాజెక్ట్ నిజంగా జరుగుతే, బాక్సాఫీస్ వద్ద మళ్లీ రికార్డులు సృష్టించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
