సెలబ్రిటీల కుటుంబాల్లో చిన్న సంగతి జరిగినా.. దాని గురించి బయటకు వెళ్లే ప్రచారం చాలా ఎక్కువగా ఉంటఉంది. సెలబ్రిటీలు ఏంతింటారు.. కాఫీలో చక్కెర ఎన్ని స్పూన్లు వేసుకుంటారు. లాంటి విషయాలమీద కూడా అపరిమితమైన ఆసక్తిని చూపిస్తూ ఉండే మనుషులు పుష్కలంగా ఉండగా, వారి కుటుంబంలో ఆస్తుల తగాదాలు దాడుల వరకు దారితీస్తే ఆ విషయం సంచలనం కాకుండా ఎలా ఉంటుంది? మంచు మోహన్ బాబు కుటుంబం ఇప్పుడు బజార్న పడింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో .. తెర మీద, తెర వెనుక ఒక వెలుగు వెలిగే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక స్థాయికి సెలబ్రిటీలే. అయితే , మొత్తం టాలీవుడ్ చరిత్రలో ఇంత ఘోరంగా బజార్న పడిన మరో సెలబ్రిటీ కుటుంబం మాత్రం లేదు.
మంచు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయి. దాని కోసం గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు తారస్థాయికి వెళ్లాయి. మోహన్ బాబు రెండో భార్య ద్వారా కలిగిన కొడుకే మనోజ్ పోలీసు స్టేషనుకు వెళ్లి మరీ ఫిర్యాదు చేసే వరకు పరిస్థితి వెళ్లింది. మోహన్ బాబు మొదటి భార్య కొడుకు విష్ణు తరఫు మనుషులు తన మీద దాడి చేసి కొట్టారనేది ఫిర్యాదు సారాంశం. స్వయంగా మంచు మోహన్ బాబు కూడా రంగంలోకి దిగి.. తన మీద మంచు మనోజ్ దాడి చేశాడని, మనోజ్ మౌనిక లను తన ఆస్తలనుంచి తొలగించాలని లేఖరూపంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు కుటుంబంలో వివాదాలు ఎటు ముదురుతున్నాయో స్పష్టత వచ్చేసింది.
శ్రీవిద్యానికేతన్ కు సంబంధించిన ఆస్తుల పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నట్టుగా, తనకు అన్యాయం జరిగిందని మనోజ్ చాలాకాలంగా రభస చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీవిద్యానికేతన్ స్కూలు విభాగాన్ని ఎన్నడో మూసివేశారు. కళాశాలలు, యూనివర్సిటీ మాత్రమే నడుస్తున్నాయి. అందులో మెజారిటీ వాటాలను విష్ణు భార్య వెరోనికా కొనుక్కున్నట్టుగా.. ఆమేరకు ఇప్పుడు కాలేజీల నిర్వహణ యావత్తూ ఆమె కనుసన్నల్లోనే నడుస్తున్నట్టుగా.. కాలేజీ యూనివర్సిటీ వ్యవహారాలకు సంబంధించి కీలక స్థానాల్లో వెరోనికా మనుషులే చేరి.. నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
టాలీవుడ్ ప్రముఖుల కుటుంబాల్లో వివాదాలు రేగడం సహజమే. కానీ తండ్రీ కొడుకులు కూడా ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకునే స్థాయిలో ఈ స్థాయిలో బజార్న పడడం మాత్రం ఇదే ప్రథమం అని పలువురు అనుకుంటున్నారు.
టాలీవుడ్ లో ఘోరంగా బజార్న పడ్డ మంచు ఫ్యామిలీ!
Sunday, December 22, 2024