సూపర్ స్టార్‌ సినిమాలో విలన్‌ గా ఆ మలయాళ నటుడు!

Wednesday, January 22, 2025

టాలీవుడ్‌ దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబోలో ఓ అడ్వెంచరస్  సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్ గా నటిస్తున్నాడని కొంతకాలం క్రితం కొన్ని వార్తలు షికారు చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా  SSMB29 అని టెంపరరీ పేరు పెట్టిన ఈ యాక్షన్ అడ్వెంచర్‌ సినిమాలో విలన్ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ని ఫైనల్ చేసినట్లు బాలీవుడ్ మీడియా అవుట్‌లెట్ నివేదించింది.రాజమౌళి  పృథ్వీరాజ్ తో కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది.  స్క్రిప్ట్ నచ్చడంతో ఆయన కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.

ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ చాలా వరకు పూర్తయింది. ఈ ఏడాది చివరిలో సినిమా షూటింగ్ ప్రారంభించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఇదే కనుక నిజమైతే ఒకే ఫ్రేమ్‌ లో ఇద్దరు స్టార్‌ నటులను చూడటం వారి అభిమానులకు పండగే అవుతుంది. ఈ భారీ ఎంటర్టైనర్‌ను దుర్గా ఆర్ట్స్‌పై కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles