ఆ ఛాన్స్‌ ని కూడా వదులుకున్న మేకర్స్‌!

Friday, December 5, 2025

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల ముందుకి రావాల్సిన మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు ఒకటి. ఈ చిత్రాన్ని దర్శకులు జ్యోతి కృష్ణ మరియు క్రిష్ కలిసి రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ఈ సినిమా రెండు పార్ట్స్ లో వస్తోంది. కానీ మొదటి భాగమే థియేటర్స్ కి రావడానికే దాదాపు అయిదేళ్లు పట్టింది.

ఈ మూవీ మొదట అనౌన్స్ చేసినప్పుడు భారీ హైప్ తో స్టార్ట్ అయింది. ఆ టైంలో పవన్ లుక్, స్టోరీ లైన్ లాంటి అప్‌డేట్స్ సినిమాపై మంచి ఆసక్తిని కలిగించాయి. కానీ మధ్యలో సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అసలే రాలేదు. అప్పటివరకు ఉన్న బజ్ కూడా నెమ్మదిగా తగ్గిపోయింది. ఇప్పుడు రిలీజ్ కి వారం రోజులే మిగిలి ఉండగా కూడా పెద్దగా ప్రమోషన్లు లేకపోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.

ఒక పాన్ ఇండియా సినిమా అయితే ఆ స్థాయిలో ప్రచారం చేయాలి. కానీ ఇప్పటి వరకూ ట్రైలర్ వదిలిన తర్వాత మళ్లీ ప్రమోషన్ అనే మాటే కనిపించట్లేదు. హీరో నుంచి, డైరెక్టర్ల నుంచి లేదా యూనిట్ లోని ఎవరినుండైనా సినిమా గురించి ఎలాంటి స్పీచ్, మీడియా ఇంటరాక్షన్ లేకపోవడం ఆశ్చర్యంగా మారింది.

ఇప్పటికైనా ఒక గట్టిగ ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసి తెలుగు రాష్ట్రాల్లోనైనా ఆ హైప్ ని రీకవర్ చేయొచ్చు. కానీ దేశవ్యాప్తంగా ఈ సినిమాని గుర్తించాలంటే ఇప్పటి నుంచే స్ట్రాంగ్ ప్రమోషన్ కావాలి. లేదంటే మిగతా భాషల ఆడియెన్స్ లో సినిమా మీద ఆసక్తి పుట్టడం కష్టమే.

ఒక్కసారి వదిలేసిన హైప్ మళ్లీ తీసుకొచ్చే అవకాశం మేకర్స్ వినియోగించుకోలేదన్న అభిప్రాయమే ఇప్పుడు ఫ్యాన్స్ లో ఎక్కువగా వినిపిస్తోంది. సినిమాకు కావాల్సిన దారుణమైన ఊపు చివరి నిమిషంలో చేసే హడావుడితో రాదు. ఇప్పుడు ఎలాంటి ప్లాన్ లేకుండా వదిలేస్తే, ఇది సినిమాకే కాకుండా పవన్ ఫ్యాన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికీ నిరాశే కలిగించే అంశం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles