మెయిన్‌ హీరో అతనే..ఆర్‌ఆర్‌ఆర్‌ పై ఫ్రెంచ్‌ నటుడు!

Monday, September 16, 2024

టాలీవుడ్ జక్కన్న తెరకెక్కించిన సినిమా ట్రిపుల్‌ ఆర్‌. ఈ సినిమాలో ఇప్పటికీ కూడా చరణ్‌ క్యారెక్టర్ గొప్పదా..? ఎన్టీఆర్‌ ది గొప్పదా అనే ప్రశ్న ఇద్దరి అభిమానుల్లో మెదిలే ప్రశ్నే. అంతేకాకుండా ఇద్దరిలో ఎవరు బాగా చేశారు.. ఏ పాత్రకు జనాల్లో రెస్పాన్స్ వచ్చిందంటూ జరిగిన చర్చలు అందరికీ తెలిసిన విషయమే. ఇదిలా ఉంటే అటు చరణ్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయం మీద సోషల్ మీడియాలో నిత్యం చర్చలు పెట్టుకుంటూనే ఉంటారు. కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ అయితే రామ్ చరణ్ పాత్రే మెయిన్ అన్నట్లు చెప్పుకొచ్చారు.

రామ్ చరణ్ పాత్రలోనే చాలా లేయర్లు ఉంటాయని, నటించడానికి చాలా స్కోప్, కష్టతరమైన పాత్ర అని కూడా వివరించారు. దాంతో విజయేంద్ర ప్రసాద్ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో ట్రోలింగ్ చేశారు.అలా ట్రిపుల్‌ ఆర్ గురించి ఎప్పుడు చర్చలు జరిగినా కూడా ఇరు హీరోల అభిమానుల మధ్య పెద్ద పెద్ద మాటల యుద్దాలు జరుగుతూనే ఉంటాయి.

తాజాగా ఓ ఫ్రెంచ్ నటుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో మెయిన్ హీరో రామ్ చరణ్ అన్నట్లు చెప్పుకొచ్చాడు. అతని పేరు మరిచిపోయాను.. సరిగా నాకు గుర్తు లేదు.. ఆర్మీలో ఉంటాడు అన్నట్లుగా సదరు నటుడు ఇంట్రో సీన్ గురించి తెలియజేశారు. ఇంతలో యాంకర్ అతడికి హింట్ ఇచ్చేసింది. మెయిన్ హీరో అంటూ రామ్ చరణ్ గురించి సదరు ఫ్రెంచ్ నటుడు లుకాస్ బ్రావో అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి. ఆ సినిమాలో ఆయన నటన అద్భుతంగా ఉందని, ఎంతో ఎమోషనల్‌గా యాక్ట్ చేశారని, బ్రీత్ టేకింగ్‌లా అనిపించిందంటూ రామ్ చరణ్ పర్ఫామెన్స్ గురించి సదరు నటుడు మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles