భారతీయ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహా ఇప్పుడు అద్భుతమైన విజయాన్ని సాధిస్తోంది. రిలీజ్ సమయంలో పెద్దగా హంగామా లేకపోయినా, థియేటర్లలో ప్రేక్షకులు ఈ సినిమాకు ఇచ్చిన స్పందన మాత్రం అంచనాలకు మించినది. ఇందులోని విజువల్ ప్రెజెంటేషన్, గ్రాఫిక్స్, ముఖ్యంగా ఆధ్యాత్మికత కలగలిపిన కథనం ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి.
తాజాగా ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని చిత్ర బృందం ప్రకటించింది. యానిమేషన్ మూవీకి ఇంత భారీ కలెక్షన్ రావడం భారతీయ సినీ చరిత్రలో తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా యానిమేషన్ సినిమాలు పరిమిత స్థాయిలోనే నడుస్తాయి, కానీ ఈ సినిమా మాత్రం ఆ పరిమితులను చెరిపేసి బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నమోదు చేసింది.
