లుక్‌ అదిరింది అన్న!

Monday, March 17, 2025

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో వస్తున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్‌ సినిమా   ‘వార్ 2’. ఈ మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ మరోసారి ముంబై వెళ్లారు. అక్కడి ఎయిర్ పోర్ట్‌లో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్లాక్ జీన్స్‌ వేసుకొని బ్లాక్ అద్దాలు ధరించిన యంగ్ టైగర్ మాస్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు.

ప్రస్తుతం ‘వార్-2’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎన్టీఆర్ తన పాత్రకు హిందీ వెర్షన్ డబ్బింగ్ చెప్పడానికి ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కాంబినేషన్ అంటే.. బాక్సాఫీస్ షేక్ అయినట్టే.

కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2′ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కాంబో అనగానే  ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles