సంక్రాంతి సీజన్ తెలుగు, తమిళ సినిమాల్లో ప్రతీ హీరో తన సినిమాను భారీగా రిలీజ్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాలనుకుంటారు. 2026 సంక్రాంతికి కూడా పలువురు స్టార్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. టాలీవుడ్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న అత్యంత అంచనావేళ ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని జనవరి 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
ఈ సినిమా హార్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతుండగా, దాన్ని పాన్ ఇండియా స్థాయిలో పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో తమిళ స్టార్ హీరో విజయ్ కూడా తన తాజా చిత్రం ‘జన నాయకుడు’ను అదే రోజున విడుదల చేయాలని భావిస్తున్నారు. దీంతో తమిళనాడు, కేరళలో ప్రభాస్ సినిమా సరిగ్గా వెళ్ళలేని పరిస్థితి ఉండొచ్చని అందరికి అనుమానం ఏర్పడింది.
కానీ, ఇటీవల కరూర్ లో విజయ్ నిర్వహించిన రాజకీయ మీటింగ్ లో జరిగిన ఘోర ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో విజయ్ తీవ్ర ఆందోళనలో పడినట్లు తెలుస్తోంది. అందువల్ల జనవరి 9న సినిమాను రిలీజ్ చేయాలా లేదా అనే విషయంలో ఇప్పుడు ఆయన కొంచెం ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ ఆయన ‘జన నాయకుడు’ను వాయిదా వేస్తే, ప్రభాస్ సినిమా కోసం మార్గం సులభమవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ప్రభాస్ చిత్రానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. అయినప్పటికీ, విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సి ఉంటుంది.
