పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రాల్లో “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా దూసుకెళ్తోంది. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ పాటను తాజాగా చిత్రీకరిస్తుండగా, షూటింగ్ స్పాట్‌ను పలువురు సినీ ప్రముఖులు సందర్శించారు. అక్కడ కనిపించిన పవన్ లుక్, సెట్స్ అట్మాస్ఫియర్ చూసినవాళ్లు ఫుల్‌గా ఎగ్జైట్ అయ్యారని సమాచారం.
ఇదే సమయంలో మరో ఆసక్తికర విషయం బయటకి వచ్చింది. తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న విజయ్ దేవరకొండ “కింగ్డమ్” సినిమా టీం కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్‌కి వెళ్లింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో కింగ్‌డం యూనిట్ కూడా అక్కడే ఉండటంతో, ఇద్దరు చిత్రాలకు చెందిన సభ్యులు కలిసిపోయారు.
ఈ సందర్బంగా పవన్ కల్యాణ్‌ను విజయ్ దేవరకొండ, నిర్మాత నాగవంశీ, హీరోయిన్లు శ్రీలీల మరియు భాగ్యశ్రీ బోర్సే కలిసి చర్చించారట. వారితో కలిసి పవన్ ఒక ఫొటోకి పోజ్ ఇచ్చారు. ఆ ఫొటోను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. అందులో అందరూ స్టైలిష్‌గా కనిపించగా, పవన్ కళ్యాణ్ మాత్రం ఫార్మల్ సూట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ ఫోటోను చూసిన ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఇప్పుడు “కింగ్డమ్” మూవీ ఆగస్టు 31న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉండగా, “ఉస్తాద్ భగత్ సింగ్” మాత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రావాలని టీం ప్లాన్ చేస్తోంది. రెండు సినిమాలకీ ఇప్పటికే బజ్ ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
