ఇప్పటికే నాకు నాలుగుసార్లు పెళ్లి అయ్యిందంటూ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్!

Tuesday, January 21, 2025

జర్నీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అంజలి..తక్కువ కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. తరువాత కొంత కాలానికి కుటుంబ సభ్యుల గొడవ అంజలి అవకాశాల్ని తగ్గించాయనే చెప్పాలి. ఇటు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అద్భుతంగా నటించి.. తన నటనతో ప్రేక్షకులందర్ని కట్టిపడేసింది ఈ అమ్మడు.

తాజాగా అంజలి గీతాంజలి మళ్లీ వచ్చింది తో ప్రేక్షకులను అలరించేందుకు మరోసారి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో అంజలి పాల్గొంది. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చర్చించిన తరువాత .. పెళ్లిపై వస్తోన్న సోషల్ మీడియాలోని రూమర్ల గురించి ప్రశ్నించారు.  

ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే నాకు నాలుగు పెళ్లిళ్లు జరిగిపోయాయి.తాజాగా ఇప్పుడు ఐదో పెళ్లి కూడా చేసేస్తున్నారు. మరీ నా పెళ్లికి నేను ఉండాలి కదా? నాకే చెప్పలేదు. చెబితే వచ్చేదాన్ని. దయచేసి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దు’’ అంటూ కాస్త సీరియస్ గా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అంజలి ఎవరితోనో లివింగ్ రిలేషన్ లో ఉంటుందని, తన ఇంట్లో ఉండటం లేదని, ఔట్ డోర్ లో ఉంటుందని వచ్చే వార్తలపై కూడా స్పందించింది.

‘నాతో ఉంటున్న వారెవరో మరీ నాకు రెంట్ ఇచ్చేసి వెళ్లినా బాగుండు. ఈ డబ్బుతో ఈఎంఐలు అయినా కట్టుకునేదాన్ని’. అంటూ అంజలి.. తనపై రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లకి  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles