మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా భారీ హిట్ మూవీ “దేవర”.  మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా తారక్ కెరీర్ లో సోలోగా బిగ్గెస్ట్ రికార్డులు అందుకుంది. మరి ఈ సినిమాకి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ లలో సంగీత దర్శకుడు అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ ఒకటి.

సినిమాలో కేవలం నాలుగు పాటలే ఉన్నప్పటికీ ఒకొకటి చార్ట్ బస్టర్స్ ని అందించాడు. అయితే ఈ సినిమాలో అన్ని పాటలు ఒకెత్తు అయితే ఆయుధ పూజ సాంగ్ ఒకటి ఒకెత్తు అన్నట్టు సస్పెన్స్ గా ఉంది. ఈ పాటని విడుదల కి తీసుకొచ్చారు. అయితే ఈ సాంగ్ ఆడియో పరంగా కంటే కూడా వీడియోగా థియేటర్స్ లో చూసాక పెద్ద హిట్ అందుకుంది. దీంతో ఈ సాంగ్ పై మంచి క్రేజ్ ఏర్పడగా ఫైనల్ గా అయితే ఈ సాంగ్ ని మేకర్స్ ఫుల్ వీడియో ఇచ్చేసారు.

సోషల్ మీడియాలో ఒక సెలబ్రేషన్ గా నిలిచిన ఈ పాట ని అఫీషియల్ గా టి సిరీస్ వారు ఫుల్ వీడియో పాట ని తెలుగులో విడుదల చేశారు. మరి ఇది మాత్రం తారక్ ఫ్యాన్స్ కి పెద్ద పండగ అనే చెప్పుకొవాలి.