స్వాగ్‌ నుంచి నాలుగో సింగిల్‌!

Tuesday, January 21, 2025

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా సినిమా ‘శ్వాగ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు హసిత్ గోలి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు ఏకంగా 4 పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో ఏర్పడబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా, ఇప్పుడు ఈ సినిమాలోని నాలుగో సింగిల్ సాంగ్ ‘నీలో నాలో..’ విడుదల చేసేందుకు చిత్ర బృందం  రెడీ అయ్యింది. ఈ మెలోడి పాటను సెప్టెంబర్ 27న సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ విడుదల చేశారు. ఇందులో శ్రీ విష్ణుతో పాటు మీరా జాస్మిన్ కనిపిస్తున్నారు. వీరిద్దరిపై ఈ పాట ఉంది.

ఇక ఈ సినిమాలో రీతూ వర్మ, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, రవిబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles