శ్రద్దకు స్వాగతం పలికిన చిత్ర యూనిట్‌..ఏం సినిమానో తెలుసా!

Sunday, December 22, 2024

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే గామి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల చేసి మంచి టాక్‌ అందుకున్నాడు. ప్రస్తుతం ఓ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మరో రెండు సినిమాలకు సంబంధించి కథా చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం.

విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి కొత్త డైరెక్టర్‌ రవితేజ ముళ్లపూడి రచన,  దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ముక్కోణపు ప్రేమకథగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో విశ్వక్ సేన్ కు జోడీగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌లు నటిస్తున్నారు.

కాగా ‘మెకానిక్ రాకీ’ మూవీ సెట్స్‌ లో హీరోయిన్‌గా  అడుగు పెడుతున్న సందర్భంగా కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్‌ ను స్వాగతిస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది . స్లిట్ మ్యాక్సీ డ్రెస్‌లో శ్రద్ధా శ్రీనాథ్‌ అల్ట్రా స్టైల్ లుక్ లో అదిరిపోయింది. భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబరు 31న విడుదల చేస్తున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే అదే రోజున తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన అమరన్ విడుదల కానుంది. దీంతో ఈ రెండు చిత్రాల మధ్య గట్టి పోటీనే  ఏర్పడింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles