బన్నీ-సుక్కు మధ్య వివాదమిదే…అసలు విషయం చెప్పిన టీం మెంబర్‌!

Wednesday, December 18, 2024

అల్లుఅర్జున్‌- లెక్కల మాస్టర్‌ సుకుమార్‌ కాంబోలో రూపుదిద్దుకుంటున్న సినిమా పుష్ప 2. అయితే ఈ సినిమా గురించి అనేక వార్తలు తెరమీదకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ విషయంలో సుకుమార్, అల్లు అర్జున్ మాజీ విభేదాలు తలెత్తాయని అందుకే సుకుమార్ చెప్పినా వినకుండా అల్లు అర్జున్ గడ్డం తీసేసాడని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ చేసిన పనికి హర్ట్ అయిన సుకుమార్ అమెరికా విహారానికి వెళ్లిపోయాడని సుకుమార్ వెళ్ళిపోయాడు అనే విషయం తెలిసి బన్నీ కూడా ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ కి వెళ్ళాడని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

 అల్లు అర్జున్ మూడు యూనిట్లతో షూటింగ్ చేయించాలని కోరితే సుకుమార్ మాత్రం వినడం లేదని ఈ నేపథ్యంలోనే వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఇదే విషయం మీద అల్లు అర్జున్ డిజిటల్ టీంకి సంబంధించిన శరత్ చంద్ర అనే వ్యక్తి అసలు ఏం జరుగుతుంది అనే విషయం మీద ఓ క్లారిటీ ఇచ్చాడు.

ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశాడు. సుకుమార్ గారు ఈ సినిమా ఎడిటింగ్ పని మొదలుపెట్టాడని, ఫస్ట్ పార్ట్ ఎడిటింగ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన బ్రేక్ తీసుకున్నాడని చెప్పుకొచ్చారు. ఎడిటింగ్ సమయంలో బ్రేక్ తీసుకోవడం చాలా కామన్ అని ఆయన చెప్పుకొచ్చారు.

దానికి మరో  అభిమాని షూటింగ్ అంతా పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఒకేసారి చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడగగా ఇప్పుడు టైం ఉంది మొదటి భాగం కంప్లీట్ చేసుకుని కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ అంతా రెడీ చేసి పెట్టుకుంటే మిగతా ఎడిటింగ్ సినిమా షూటింగ్ పూర్తయ్యాక చేసుకోవచ్చు.

హ్యాపీగా డిసెంబర్ 6వ తారీకున సినిమాని విడుదల చేయొచ్చు అందుకే అలా చేసుకుంటూ ఉండవచ్చు అని కామెంట్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ సుకుమార్ మధ్య ఏర్పడిన విభేదాలు అంటూ జరుగుతున్న వార్తలకు అల్లు అర్జున్ టీం నుంచి ఓ క్లారిటీ వచ్చేసింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles