సంక్రాంతి కానుకగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విడుదల కి వచ్చి అదరగొట్టిన చిత్రాల్లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “డాకు మహారాజ్” కూడా ఒకటి. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి బాలయ్య కెరీర్ లో మరో 100 కోట్ల సినిమాగా రికార్డులు సృష్టించింది.
అయితే ఈ సినిమా దర్శకుడు కొల్లి బాబీ ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ని అభిమానులతో పంచుకున్నారు. డాకు మహారాజ్ సినిమాని తన స్వస్థలం గుంటూరులో సంగీత దర్శకుడు థమన్ తో అది కూడా మైత్రి సినిమాస్ వారి థియేటర్ లో చూడడం అనేది ఎంతో ఆనందంగా మధురానుభూతిని కలిగించింది అని తను తెలిపి పలు ఫొటోస్ కూడా పంచుకున్నారు.
అలాగే థియేటర్ లో బాలయ్య గారి అభిమానులు ఇచ్చిన రెస్పాన్స్ తో మాకు మరింత ఎనర్జీ వచ్చింది అంటూ బాబీ చెప్పుకొచ్చారు.