అది నిజం కాదంటున్న డైరెక్టర్‌!

Wednesday, December 18, 2024

రజినీకాంత్‌ హీరోగా వెట్టయాన్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా సందర్భంగా ఈ సినిమా అక్టోబర్‌ 10 న ఈ సినిమా  తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. తాజాగా ఈ సినిమా దర్శకుడు జ్ఞానవేల్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫహాద్ ఫాజిల్ నటించిన బ్యాటరీ పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

నిజానికి ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ పాత్ర కోసం నానిని సంప్రదించారని అయితే నాని చేయను అన్న తర్వాత ఫహద్ ఫాజిల్ ని సంప్రదించి ఆయన చేత నటింప చేశారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే విషయం మీద దర్శకుడు తాజాగా స్పందించాడు. తాను ఈ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు మొదటి ఆప్షన్ గా ఫహాద్ ఫాజిల్ నే అనుకున్నానని …ఆయనకు  ఆ పాత్ర చెప్పగానే ఫహాద్ ఫాజిల్ వెంటనే ఒప్పుకున్నాడని చెప్పుకొచ్చారు.

అలాగే రానా పాత్రకి కూడా ముందుగా రానానే అనుకున్నామని వేరే ఏ నటుడిని సంప్రదించడం కానీ, వేరే ఆలోచన కానీ చేయలేదని టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles