అలాంటి సన్నివేశం ఉంటుందని డైరెక్టర్‌ చెప్పలేదు..!

Thursday, December 26, 2024

చియాన్‌ విక్రమ్‌ హీరోగా నటించి విడుదలకు రెడీ అయిన తంగలాన్‌ కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మాళవిక మోహనన్‌, పార్వతి తిరువొత్తు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక.. షూటింగ్ రోజులను మరోసారి గుర్తుచేసుకున్నారు.ఇంటర్వ్యూలో మాళవిక మోహనన్‌ మాట్లాడుతూ… ‘ఒకరోజు నేను సెట్‌కు వెళ్లే సరికి పెద్ద గేదె ఉంది. డైరెక్టర్ నా వద్దకు వచ్చి దానిని ఎక్కగలవా అని నన్ను అడిగారు. ఏదో సరదాగా అన్నారనుకున్నా. నా మేకప్‌ పూర్తయిన తర్వాత గేదెపై కూర్చోమన్నారు. నేను ఎప్పుడూ గేదె పైకి ఎక్కలేదని చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. షూట్ చేయాలి, గేదెపై కూర్చో అన్నారు. చాలా భయంతోనే దానిపై ఎక్కాను. త్వరగానే ఆ షాట్ పూర్తయింది.

అలాంటి సన్నివేశం ఉంటుందని డైరెక్టర్ నాకు ముందుగా చెప్పలేదు. అందుకే ఒక్కసారిగా షాక్ అయ్యా’ అని చెప్పుకొచ్చింది. ‘తంగలాన్‌ సినిమా కోసం నేను 5 గంటలు మేకప్‌ వేసుకోవాల్సి వచ్చింది. స్కిన్‌ స్పెషలిస్ట్‌, కంటి డాక్టర్‌ ఇలా చాలా మంది డాక్టర్లను కలిసినట్లు ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.

ఒక్కోరోజు దాదాపు 10 గంటల పాటు కెమికల్స్‌తో చేసిన మేకప్‌ శరీరంపై ఉంచుకోవాల్సి వచ్చింది. దాంతో నాకు ఎలర్జీ వచ్చింది. ఒక్కోసారి ఈ షూటింగ్ ఎప్పుడు అయిపోతుందా? అని అనిపించింది’ అని మాళవిక చెప్పుకొచ్చింది. తంగలాన్‌లో నటీనటులందరూ డీ గ్లామరైజ్‌గా కనిపించనున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles