మీడియాకి క్షమాపణలు చెప్పిన దర్శకధీరుడు!

Sunday, December 22, 2024

దర్శక ధీరుడు ఎస్ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు పార్ట్‌ లు కూడా కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా పాన్‌ ఇండియా లెవల్లో భారీ విజయాలను సాధించి గొప్ప సినిమాలుగా నిలిచాయి.  బాహుబలి 2 సినిమా మరో అడుగు ముందుకేసి ఎన్నో రికార్డులను బద్దలుకొట్టింది. అయితే, అంతటి ఘన విజయం సాధించిన బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో రాజమౌళి ఓ యానిమేటెడ్ సిరీస్ తీసుకొస్తున్నారన్న విషయం తెలిసిందే.

బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుందని మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ యానిమేటెడ్ సిరీస్ కోసం రాజమౌళి మీడియా ముందుకు వచ్చారు . ఈ సిరీస్ లోని మొదటి రెండు ఎపిసోడ్స్ ను ప్రీమియర్ గా మీడియా కోసం ఏఎంబీలో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ తో పాటు మీడియా సమావేశం కోసం ఢిల్లీ, ముంబై నుంచి ప్రత్యేక మీడియా ప్రతినిధులు నగరానికి విచ్చేశారు. ఇక ఈ క్రమంలో మీడియా ప్రతినిధి ఒకరు రాజమౌళిని మెచ్చుకుంటూనే ఇన్నేళ్లల్లో ఎప్పుడూ లేని విధంగా మీడియా మీటింగ్‌ కు ఎందుకు లేట్ గా వచ్చారు అంటూ ప్రశ్నించారు. ఈ విషయం  మీకు తెలిసి జరిగిందా? లేదా మీకు ఇచ్చిన సమాయనికే వచ్చారా? అని ప్రశ్నించారు.

దానికి రాజమౌళి మాట్లాడుతూ… తనకు చెప్పిన సమయానికి తాను వచ్చానని, ఐదున్నరకు రమ్మన్నారు ఐదున్నరకు వచ్చినట్లు వివరించారు. నా వల్ల జరిగిన ఈ ఆలస్యం వలన ఇబ్బంది పడితే సారీ అంటూ పేర్కొన్నారు. ఇక బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ మే 17వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍ కానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles