నాలుగో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్‌ నటుడి కుమార్తె!

Sunday, December 22, 2024

సీనియర్‌ నటుడు విజయకుమార్‌  కుమార్తె వనిత విజయ్‌ కుమార్‌ మీద ఓ వార్త వైరల్‌ అవుతుంది. అది ఏంటంటే..ఆమె మరోసారి అంటే..నాలుగోసారి పెళ్లికి రెడీ అవుతుందని సమాచారం. వనిత విజయ్ కుమార్ నడుపుతున్న యూట్యూబ్‌ ఛానెల్‌ లో ఓ అభిమాని ఆమె పెళ్లి గురించి  అడిగిన ఓ ప్రశ్నకు వనిత సమాధానమిస్తూ, ‘మీరు ఊహించని దాని కోసం ఎదురు చూడండి’ అంటూ క్రేజీ అన్సర్‌ ఇచ్చింది.

మళ్లీ పెళ్లి గురించి అడిగితే.. ఊహించని దాని కోసం ఎదురు చూడండి’ అంటుంది అంటే.. ఆమె మరోసారి పెళ్లి పీటలెక్కబోతుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  అయితే ఈ పోస్ట్ ల పై అటు వనిత విజయ్ కుమార్ ఇంకా స్పందించలేదు. తన నాలుగో పెళ్లి పై వార్తలను ఆమె ఖండించకపోవడంతో నిజంగానే ఆమె మరో సారి పెళ్లి పై మక్కువ చూపుతుందని టాక్. ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా వనిత మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఎన్నో చూశాను. అయితే, ఒంటరిగా జీవించడం నాకు ఇష్టం లేదు. నాకు ఓ తోడు కావాలి. సంతోషంగా ఉండాలని ఆశ పడటంలో తప్పు లేదు కదా’ అంటూ సమాధానం చెప్పి మరోసారి అందరూ ఆమె గురించి మాట్లాడుకునేలా చేసుకుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles