తేదీ మారిందిగా!

Wednesday, January 22, 2025

విశ్వక్‌ సేన్‌ హీరోగా, మీనాక్షి చౌదరి,  శ్రద్ధాదాస్ కథానాయకలుగా నటిస్తున్న సినిమా  ‘మెకానిక్ రాకీ’. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి డైరెక్షన్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ లాస్ట్‌ లో  ఉన్న ఉన్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల చేస్తామని మూవీ మేకర్స్ ఇంతకు ముందే ప్రకటించారు. ఇటీవల విడుదల చేసిన మెకానిక్ రాకీ ట్రైలర్ గ్లిమ్స్ కు, ఈ చిత్రంలో రెండు లిరికల్ సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

కాగా ‘మెకానిక్ రాకీ’ విశ్వక్ సేన్ సినీ కెరీర్ లో రానున్న10వ చిత్రం. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు విశ్వక్ సేన్. కాగా ఇప్పుడు ఈ సినిమా దీపావళి రేస్ నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దసరా నాడు విడుదల చేసిన పోస్టర్ లో కూడా గతంలో ప్రకటించిన రిలీజ్ డేట్ ను తొలగించారు మేకర్స్.దీంతో ఈ సినిమా ఆక్టోబరు విడుదల ఉందని భావించారు.

ఆ ఊహాలను నిజం చేస్తూ మెకానిక్ రాఖీ సినిమాను నవంబరు 22న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెకానిక్ రాకీ ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్ సురేష్ సంస్థ కొనుగోలు చేసింది. మెకానిక్ రాకీ సినిమాను ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించగా, ప్రముఖ కమెడియన్, నటుడు సత్యం రాజేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహారిస్తుండగా జేక్స్ బిజోయ్ స్వరాలూ సమకూస్తున్నారు. అక్టోబరు రేస్ నుండి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘క’ సినిమా రిలీజ్ కానున్నట్టు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles