‘ఘాటి’ గ్లింప్స్‌కి తేదీ ఖరారు!

Sunday, December 22, 2024

టాలీవుడ్‌  టాలెస్ట్‌ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న తాజా సినిమాకి  ‘ఘాటి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర బృందం ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది.

దర్శకుడు క్రిష్ జాగర్లలమూడి దర్శకత్వం వహిస్తున్న  ఈ సినమా గ్లింప్స్‌ని నవంబర్ 7న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఈ ట్రీట్ ఇవ్వనున్నట్లు  చిత్ర బృందం ప్రకటించింది.

 దీంతో ఈ సినిమా గ్లింప్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై  భారీగా అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే.

 ఇక ఈ సినిమా అనుష్క శెట్టి కెరీర్‌లో మరో మైల్‌స్టోన్  చిత్రంగా నిలుస్తుందని సినిమా బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles