ప్రమోషన్స్‌ షూరు చేసిన ముద్దుగుమ్మ!

Thursday, December 11, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ఓజి పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఆమెపై వచ్చిన సాంగ్ వీడియోలు, గ్లింప్స్ కి మంచి స్పందన రావడంతో ఈ జోడీ మీద ఆసక్తి మరింత పెరిగింది.

ఇక తాజాగా ప్రియాంక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముందుకు వచ్చింది. ప్రింట్ మీడియా, వెబ్ మీడియా లకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. దీంతో ఓజి ప్రమోషన్స్ అధికారికంగా మొదలయ్యాయని చెప్పొచ్చు.

ఇంకా ఒకవైపు ఈ సినిమా ఇతర భాషల్లో ప్రమోషన్స్ ఎలా జరపబోతున్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles