కీలక ఘట్టం ముగిసిందోచ్‌!

Thursday, September 19, 2024

నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్బీకే 109 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్డేట్‌ ను డైరెక్టర్‌ బాబీ ఇచ్చారు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల మీద నాగ వంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జైపూర్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ షెడ్యూల్ ముగిసినట్లు బాబీ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఒక ఇంటెన్స్ షెడ్యూల్ జైపూర్లో ముగిసిందని ఆయన ఎనర్జీ ఇంకెవరు మ్యాచ్ చేయలేరని ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్‌  చెప్పకొచ్చారు. ప్రతి మూమెంట్ ని ఆయన తనదైన శైలిలో మెరిసేలా చేశారని బాలకృష్ణతో కొన్ని అద్భుతమైన సీక్వెన్స్ లో ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీగా ఉండాలి అంటూ బాబీ ట్వీట్ లో పేర్కొన్నాడు.

అంతేకాక టైటిల్ టీజర్ త్వరలోనే విడుల చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ మూవీకి  వీరమాస్ అనే ఒక టైటిల్ ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు గతంలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి మాస్‌ టైటిల్‌ తమ అభిమాన నటుడి మూవీకి పెట్టకూడదని సోషల్‌ మీడియా వేదికగా నందమూరి అభిమానులు రిక్వెస్ట్ లు పెట్టారు. ఈ నేపథ్యంలో సినిమాకి అలాంటి టైటిల్ పెడతారా లేక మరేదైనా టైటిల్ పెడతారా అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles