గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో “పెద్ది” అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ – సుకుమార్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని ముందే అధికారికంగా ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.
అయితే సినిమా ప్రకటించినప్పటి నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ లో కొంత కన్ఫ్యూజన్ మొదలైంది. అసలెప్పుడు ప్రారంభమవుతుంది? ఎలాంటి స్టోరీ ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చరణ్ – సుకుమార్ సినిమా గురించి స్వయంగా సుకుమార్ స్పందించడంతో విషయానికి క్లారిటీ వచ్చింది.
తన స్వగ్రామమైన మలికిపురం వెళ్లిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుకుమార్, తాను చేస్తున్న తదుపరి సినిమా రామ్ చరణ్ తోనే అని చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు, ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు వెల్లడించారు. అంటే ఇప్పుడు స్పష్టంగా చెప్పొచ్చే విషయమేంటంటే, ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చినా, మేకర్స్ శాంతంగా స్క్రిప్ట్ వర్క్ మరియు ఇతర కార్యక్రమాలతో ముందుకు వెళ్లిపోతున్నారు.
ఇది చూస్తుంటే చరణ్ 17వ సినిమాగా సుకుమార్ సినిమా ఖచ్చితంగా రాబోతోందన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మళ్లీ ఆర్య 2, రంగస్థలం తరహాలో మరో సరికొత్త కథతో ఈ కాంబో భారీ హిట్ ఇవ్వడం ఖాయం అనే అభిప్రాయం కూడా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
