బ్రేకప్‌ అయ్యింది..మింగిల్‌ అయ్యేందుకు రెడీ అంటున్న ముద్దుగుమ్మ!

Sunday, December 22, 2024

లోక నాయకుడి కుమార్తె శ్రుతి హాసన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. గతేడాది వరుసగా రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. శ్రుతి తన బాయ్‌ ఫ్రెండ్‌ శాంతను హజారికాతో అధికారికంగా విడిపోయినట్లు ప్రకటించింది.

తాజాగా తన బ్రేకప్‌ న్యూస్‌ను అభిమానులతో జరిపిన ఇన్‌స్టాగ్రామ్‌ చిట్‌చాట్‌ ద్వారా తెలిపింది. ‘మీరు సింగిలా? లేదా ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ‘నేను సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు సమాధానమివ్వను. కానీ సమయం వచ్చింది కాబట్టి వివరిస్తున్న అంటూ చెప్పుకొచ్చింది.

నేను ఇప్పుడు సింగిల్‌గా నా జీవితాన్ని చాలా ఆనందంగా ఆస్వాదిస్తున్నా. ఇంతకు మించి ఇంకేం చెప్పను’ అని సమాధానమిచ్చింది. దీంతో తన బ్రేకప్‌ను శృతిహాసన్‌ అధికారికంగా ప్రకటించేసిందని నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. కోవిడ్‌ సమయంలో శాంతాను హజారికాతో శృతిహాసన్‌ డేటింగ్‌ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ జంట ముంబయిలో ఒకే ఫ్లాట్‌లో సహజీవనం కూడా చేశారు.

ఇద్దరు కలిసి చేసిన ఫన్నీ వీడియోలను తరచుగా సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకునేవారు. నెలక్రితం వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో అయ్యారు. దాంతో ముంబయి మీడియాలో బ్రేకప్‌ వార్తలొచ్చాయి. శృతిహాసన్‌ తాజా చిట్‌చాట్‌తో అది నిజమని తేలిపోయింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles